Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటమనేది పగటి కల
- 13న జాతీయ రహదారి దిగ్బంధనం
- విలేకర్ల సమావేశంలో మంద కృష్ణమాదిగ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ నమ్మబలికి..ప్రధాని నరేంద్రమోడీ మోసం చేశారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎంఆర్పీఎస్) వ్యవ స్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళ వారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 13న హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని తెలిపారు. ఆ రోజు ప్రధాని పర్యటనతో సంబంధం లేకుం డానే నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. అధికారంలోకొచ్చి తొమ్మిదేండ్లయినా ఈ విషయాన్ని ఇప్పటికీ పార్లమెంట్లో ప్రస్తావిం చకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, కిషన్‌రెడ్డిల సమక్షంలో వర్గీకరణపై మోడీ హామీ నిచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్యోగ నోటి ఫికేషన్లు పడుతున్నాయనీ, వర్గీకరణ చట్టబద్ధం కాకపోవటం వల్ల మాదిగ విద్యార్థి, నిరుద్యోగులు నష్టపోతున్నారని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెటు ్టకోకపోవటం..పండిట్ దీన్‌దయాళ్ స్ఫూర్తికి భిన్నమైందని గుర్తుచేశారు. వర్గీకరణ సమస్యపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఎంఆర్పీఎస్ కార్యకర్తలపై రాష్ట్రంలో బీజేపీ దాడులు చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సహనానికి పరీక్ష పెట్టొద్దని హెచ్చరించారు. దాడికి ప్రతి దాడులు తప్పవని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటూ బీజేపీ పగటి కల కంటోందనీ, దీంతో సోయిలేని మాటలు మాట్లాడుతు న్నారని విమర్శించారు. మాదిగ పల్లెల్లోకి బీజేపీ నాయకులను రానీయొ ద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేశ్‌మాదిగ, ఎంఎస్పీ జాతీయ నాయకులు మున్నూ రు కాపు సూరి, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు సోమశేఖర్ పాల్గొన్నారు.