Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇద్దరు అధికారులకు ఇది వరకు ఇచ్చిన పోస్టింగ్‌లను రద్దు చేస్తు కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు. వివారాల్లోకి వెళితే... పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎస్.రంగారెడ్డికి పీసీఎస్ అండ్ ఎస్ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. గ్రేహౌండ్స్ ఏఎస్పీ యోగేష్ గౌతమ్‌ను సైబరాబాద్ అడ్మిన్ డీసీపీగా బదిలీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఎస్పి ఆర్. వెంకటేశ్వర్లుకు సీఐడీలో పోస్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న మరో ఎస్పీ రాఘవేంద్రరెడ్డిని రైల్వే పాలనా విభాగం ఎస్పీగా నియమించారు. ఎస్పీ పూజాకు రాష్ట్ర పోలీసు అకాడమిలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఇది వరకు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను రద్దు చేసి తిరిగి ఆమెను వరంగల్ పీటీసీ ప్రిన్సిపల్‌గా నియమించారు. వరంగల్ పీటీసీ ప్రిన్సిపల్‌గా ఎస్పీ సతీష్‌కు ఇచ్చిన పోస్టింగ్‌ను రద్దు చేసి ఆయనను డీజీపీ కార్యాలయంలో లీగల్ ఎస్పీగా నియమించారు. లీగల్ ఎస్పీగా డి.మురళీధర్‌కు ఇది వరకు ఇచ్చిన పోస్టింగ్ ఉత్తర్వులను రద్దు చేసి వరంగల్ డిప్యూటీ కమిషనర్ (క్రైమ్స్)గా నియమించారు.