Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు నిందితుల అరెస్ట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
టోఫెల్ పరీక్షలో మంచి స్కోర్ ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడు తున్న నలుగురు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రెండు ల్యాప్టాప్స్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయంలో ఏసీపీ కెవిఎం.ప్రసాద్‌తో కలిసి జాయింట్ సీపీ స్నేహామెహ్రా మంగళవారం వివ రాలు వెల్లడించారు. హైదరాబాద్ నగరానికి చెందిన శ్రవణ్ కుమార్, ఆదిత్య రారుపూర్ ఎన్ఐటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. వీరికి జీఆర్ఈ, టోఫెల్లో మంచి పట్టుంది. జీఆర్ఈ, టోఫెల్ పరీక్షలో స్నేహితులకు సహాయం చేస్తుండేవారు. ఈ క్రమంలో డబ్బులు సంపాదిం చాలని నిర్ణయించుకున్నారు. మిగతా స్నేహితులు సాయి సంతోష్, కిషోర్, కిరణ్ కుమార్, గుణశేఖర్‌తో కలిసి ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించటానికి అవసరమైన జీఆర్ఈ, టోఫెల్ పరీక్షలో మంచి మార్కులు వచ్చేలా చేస్తామంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నారు. రూ.20వేలకే మంచి స్కోర్ వచ్చేలా ఇంట్లోనే పరీక్షలు నిర్వహిస్తామంటూ విద్యార్థులకు చెప్పేవారు. డబ్బులు చెల్లించిన వారితో హస్తినాపురంలోని నందు ఇంట్లో పరీక్షలు రాయించేవారు. ఎగ్జామ్ పేపర్స్‌ను రహస్యంగా ఫొటోలు తీసి జవాబులను పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అందజేస్తారు. ఈ వ్యవహారంపై కొందరు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఏసీపీ ప్రసాద్ ఆదేశాలతో సీఐ నవీన్, ఎస్ఐ వెంకటాద్రి విచారణ చేపట్టి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఆదిత్య, గుణశేఖర్ కోసం గాలిస్తున్నారు.