Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని తోడుకొమ్మంటూ సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు చెప్పడం తెలంగాణకు తీరని ద్రోహం చేయడమేనని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. జీవనది లాంటి శ్రీరాంసాగర్ మహారాష్ట్ర చేతికి ఇస్తే ప్రాజెక్టు పరివాహక ప్రాంతం స్మశానమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాలు ఎడారిగా మారిపోతాయన్నారు. ఎస్సారెస్పీ వరద కాలువ ప్రాజెక్టు వధా అవుతుందని తెలిపారు. ఇప్పటికైనా ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే రైతు ఉద్యమం చేయక తప్పదని హెచ్చరించారు.
ఖర్చు చేయకుండా బడ్జెట్ కేటాయింపులెందుకు?: పొన్నాల లక్ష్మయ్య
గతేడాది బడ్జెట్లో పెట్టిన మేరకు ఖర్చు చేయని రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి కేటాయింపులు మరింత పెంచడం ఎందుకని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. గత సంవత్సరం రూ.2.50 లక్షల కోట్ల బడ్జెట్‌ని ప్రవేశపెట్టి, కేవలం రూ.1,80 లక్షల కోట్లే ఖర్చు చేశారనీ, మిగిలిన రూ.70 వేల కోట్లు ఖర్చు పెట్టే అవకాశమే లేదని తెలిపారు. అదే తరహాలో ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ.2.90 లక్షల కోట్లు కూడా ఖర్చు పెట్టే అవకాశం లేదని తెలిపారు. అప్పులు చేసేందుకు కేంద్రం అనుమతించడం లేదనీ, మిగిలిన మార్గాల ద్వారా కూడా ఆదాయం పెంచుకునే వసతులు కనిపించడం లేదని విమర్శించారు.
గిరిజన బంధు ప్రస్తావనేది?
మునుగోడు ఎన్నికల్లో గిరిజన బంధు ప్రకటించిన సీఎం కేసీఆర్ బడ్జెట్లో దాని ప్రస్తావన ఎందుకు లేదో చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రశ్నించారు. ఎస్టీలకు కనీసం 10 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.