Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడ్డెర వృత్తిదారుల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వడ్డెర వృత్తిదారులకు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి విఘ్నేశ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు వేల కోట్లు మాత్రమే కేటాయించట మనేది ఇంటికో ఈక ఊరికో కోడి అనే చందంగా ఉందని విమర్శిం చారు. రాష్ట్రంలో సుమారు 48 లక్షల వడ్డెర వృత్తిదారుల జనాభా ఉంటే.. దీనిక నుగుణంగా నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. వీరంతా సామాజి కంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన వారని తెలిపారు. వీరి అభివృ ద్ధికి దోహదం చేసేవిధంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.