Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ఊరు గాని ఊరు' అద్భుతమైన రచన అని రాష్ట్ర వ్యవ సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించా రు. మంగళవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస స మూదాయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత కోట్ల వనజాతి రచించిన 'ఊరు గాని ఊరు' నవలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రచయిత వనజాతకు అభినందనలు తెలిపారు. తనకు అంకితమిచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ పర్యావరణం, స్త్రీల విషయంలో దృష్టికోణం మారాల్సిన అవసరముందని తెలిపారు. రాష్ట్రంలో మారిన గ్రామాల పరిస్థితిపై రచనలు రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.