Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఐఎం ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమీక్ష
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్ పాతబస్తీని మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఎస్ఆర్డీపీ ప్రాజెక్ట్ కింద పౌరుల అవసరాలే కేంద్రంగా అనేక అభివృద్ధి పనులు చేపట్టామనీ, వాటిని మరింత విస్త్రుత పరుస్తామని తెలిపారు. గడచిన 8 ఏండ్లలో పాతబస్తీ బాగా అభివృద్ధి సాధించిందన్నారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో హౌం మంత్రి మహమూద్ అలీ, ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కూమారి, మున్సిపల్ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ అరవింద్ కూమార్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, జలమండలి, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నగరం నాలుగు దిశల విస్తరిస్తూ అద్భుతమైన ప్రగతితో ముందుకు పోతున్నదన్నారు. ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా నగరాన్ని అభివద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. పాతబస్తీలో భారీగా రోడ్డు నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే పలు ఫ్లై-ఓవర్లు, రోడ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. జనావాసాలు అధికంగా ఉన్న పాతబస్తీలాంటి ప్రాంతాల్లో రోడ్డు వెడల్పు కార్యక్రమం సవాల్‌తో కూడుకున్నదనీ, తప్పనిసరి ప్రాంతాల్లోనే ఈ పనులు చేపడుతున్నామని చెప్పారు. ట్రాఫిక్ జంక్షన్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, మూసీపై బ్రిడ్జిల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తయ్యాయన్నారు. పాతబస్తీలో తాగునీటి సౌకర్యాల అభి వృద్ధి కోసం దాదాపు రూ. 1,200 కోట్లు ఖర్చు చేశా మన్నారు. ఈ ప్రాంతంలో రెండున్నర లక్షలకుపైగా నల్లా కనెక్షన్ల ద్వారా ఉచిత తాగునీరు అందుతుంద న్నారు. జలమండలి ద్వారా మురుగునీటి శుద్ధి కేంద్రా లు ఏర్పాటు చేస్తున్నా మని చెప్పారు. ఇక్కడ విద్యుత్ సరఫరా వ్యవస్థ మెరుగైం దనీ, పారిశుధ్య నిర్వహ ణలో జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుందని వివ రించారు. ఈ ప్రాంతంలో 84 బస్తీ దావాఖానాలు ఏర్పాటు చేశామన్నారు. మీరాలం మార్కెట్ అభి వృద్ధి, మీరాలం ట్యాంక్ పైనుంచి ఆరు లైన్ల కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రతిపాదనలు డీపీఆర్ దశలో ఉన్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖలతో కలిసి పని చేస్తామని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు.