Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు,మందకృష్ణ మాదిగ, డీవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ సంఘీభావం
- కాశీంతోపాటు నేతల అరెస్ట్
నవతెలంగాణ-ఓయూ
విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ తో ఓయూలో తెలుగు విభాగం హెడ్ ప్రొఫెసర్ కాశీం చేస్తున్న దీక్ష రెండో రోజు కొనసాగింది. దీక్షలో ఉంటూ తన బోధనను ఆపకుండా కళాశాల ఎదుటే బోర్డు పెట్టి మూడు గంటల పాటు విద్యార్థులకు పాఠాలు బోధిం చారు. ఈ దీక్షకు అనేకమంది ప్రొఫె సర్లు, విద్యార్థి నాయకులు, యూనివ ర్సిటీ విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపాల్స్, ప్రొఫెసర్లు మద్దతు ప్రకటించారు. దీక్షా శిబిరాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మార్పీ ఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సందర్శించి సంఘీభావం తెలిపారు.
కాశీం అరెస్ట్
దీక్ష చేస్తున్న ప్రొ.కాశీం, దీక్షకు మద్దతు తెలపడానికి వచ్చిన డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, మందకృష్ణ మాదిగ, విద్యార్థి సంఘాల నాయకులను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు.