Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 నుండి 20 వరకు తాండ్ర కుమార్ వర్ధంతి కార్యక్రమాలు : ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల నోట్లో బెల్లం పెట్టీ కంట్లో కారం కొట్టినట్టు ఉందని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి తెలిపారు. ప్రజా సంక్షేమం పేరుతో ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్లో సామాజిక వర్గాలకు ఎలాంటి ఉపయోగకరమైన అంశాల్లేవని మంగళవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. గత బడ్జెట్ లాగానే అంకెల గారడీతో నిండి ఉందని వివరించారు. ఇది కేవలం కార్పొరేట్ పెట్టుబడి దారులకు ఉపయోగపడేలా ఉందనీ, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారని విమర్శిం చారు. ఇప్పటి కైనా రాష్ట్ర బడ్జెట్లో ప్రజలకు సామాజికపరంగా అన్ని విధాలు గా అభివృద్ధికి శాస్త్రీయమైన నిధులు కేటాయించ కపోతే ప్రజాందోళన తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈనెల 14 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంసీపీఐ (యూ) మాజీ రాష్ట్ర కార్యదర్శి తాండ్రకుమార్ ప్రథమ వర్ధంతి కార్యక్ర మాలను నిర్వహిస్తామని తెలిపారు. మొదటిరోజు మియా పూర్లోని తాండ్రకుమార్ స్మారక స్థూపం నుంచి ముజాఫర్ అహ్మద్ నగర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తా మనీ, ఆయన విగ్రహావిష్కరణ ఉంటుందని తెలిపారు.