Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ బోర్డు స్పష్టీకరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్‌లో ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ఆన్లైన్ మూల్యాంకనం చేపట్టే ప్రక్రియకు సంబంధించిన టెండర్లో పాల్గొనే అర్హత గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు కొత్త అవతారమైన ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంటర్, ప్రథమ, ద్వితీయ సంవత్సరం లోని లాంగ్వేజ్‌తోపాటు ఆర్ట్స్, కామర్స్ (హ్యుమానిటీస్) సబ్జెక్టులకు సంబంధించిన 35 లక్షల జవాబు పత్రాలను ఆన్లైన్ మూల్యాంకనం చేపట్టనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్లో వాటి సమర్పణకు గురువారం వరకు గడువున్నది. ఈ మేరకు ఇంటర్ బోర్డు పరీక్షల నియంత్రణాధికారి (సీవోఈ) బి జయప్రదబాయి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల ఒకటో తేదీన ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహిం చామని తెలిపారు. ఈ సమావేశానికి గ్లోబరీనా ప్రతినిధులు హాజరయ్యారని పేర్కొన్నారు. రాతపూర్వకంగా వారు ఎలాంటి ప్రతిపాదనలను సమర్పించలేదని వివరిం చారు. అయితే ఆ సంస్థపై సస్పెండైన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పి మధుసూదన్‌రెడ్డి నిరాధార ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు.