Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ధర్మాసనం విచారణ
న్యూఢిల్లీ. ఢిల్లీ మేయర్ ఎన్నికల వాయిదాల పర్వంపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరపనున్నది. ప్రతిపక్ష బీజేపీ సభ్యులు, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల మధ్య సభలో మళ్లీ గందరగోళం చెలరేగడంతో మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోకుండానే మూడుసార్లు సభ వాయిదా పడింది. మునిసిపల్ హౌస్ సమావేశమైన ప్రతిసారీ బీజేపీ అడ్డుకుంటోంది. గతంలో రెండుసార్లు ఎన్నిక వాయిదా పడి మూడోసారి సభ సమావేశమై నపుడు... లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసిన 10 మంది ఢిల్లీ కౌన్సిలర్లు ఓటు వేసేందుకు అనుమతించడంతో ఆప్ విరుచుకుపడింది. దీంతో సభా కార్యక్రమాల్లో అంతరాయం తలెత్తింది.
కీలకమైన 18 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులలో ఆరుగురిని కూడా ఎన్నుకోవాల్సి ఉంది. మిగిలిన 12 మందిని జోనల్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటారు. కాగా, కీలకమైన ఆరుగురు సభ్యుల ఎన్నికలో మూడు సీట్లు ఆప్ గెలుచుకోనుండగా, బీజేపీ రెండు సీట్లు దక్కుంచుకోనుంది. కీలకమైన ఆరో సీటు విషయంలోనే సభలో గందరగోళం తలెత్తింది. నామినేట్ సభ్యులను ఓటింగ్‌కు అనుమతిస్తే బీజేపీకి ఆ సీటు దక్కే అవకాశం ఉన్నది. ఇది ఆప్‌కు ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఆప్ నిరసనకు దిగింది.అయితే ఇప్పటికైనా ఢిల్లీ మేయర్ ఎన్నిక సజావుగా జరుగుతుందా..లేదా అని జనంలో చర్చ.