Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేవంత్ రెడ్డి కేంద్రంపై పోరాడాలి :మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం కన్నా రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కువ నిధులను కేటాయించిందని గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, హరిప్రియ నాయక్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డికి సోయి ఉంటే కేంద్రంపై పోరాడాలని సూచించారు. సమయం వచ్చిన ప్పుడు గిరిజన బంధు ఇస్తామనీ, పోడు భూములను త్వర లోనే పంపిణీ చేస్తామని తెలిపారు. గిరిజన యూనవర్సిటీపై ప్రతిపాదన అందలేదని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి అబద్ధపు ప్రకటన చేశారని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2017లోనే ములుగు జిల్లా వద్ద 170 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు.