Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం
- విజేతకు బహుమతిగా మాస్సే డైనాట్రాక్ ట్రాక్టర్
నవతెలంగాణ-హైదరాబాద్
వ్యవసాయరంగంలో కొత్త ఆలోచనలను, స్ఫూర్తివంత మైన పారిశ్రామిక తత్వాన్ని గుర్తించేందుకు మాస్సే డైనాస్టార్ -2023 పోటీని ప్రారంభించినట్టు ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్(టఫె) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. మాస్సె ఫెర్గూసన్ డైనా ట్రాక్ ట్రాక్టర్‌తో విభిన్నంగా మీరు ఏం చేయగలరు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పడంతో పాటు పోటీదారులు వ్యవసాయం కోసం వినూ త్న పరిష్కారాలు, మెళుకువలు, వ్యవసాయ కోసం డైనాట్రాక్ వినియోగం, సమాజాన్ని విస్తృత స్థాయిలో రూపాంతరీక రించడం వంటి అంశాలపై తమ ప్రత్యేకమైన, వినూత్నమైన ఆలోచనను పది నిమిషాలకు మించకుండా పంపాలని సూచించింది. పోటీలో పాల్గొనేవారు Massey Fergusonindia.com/DYNASTAR వెబ్సైట్లో రిజిస్టర్ కావాలని సూచించింది. ఎంఎఫ్ డైనాస్టార ట్రాక్టర్ గురించి నాలుగు ప్రశ్నలతో కూడిన క్విజ్‌లో సమాధానం చెప్పాలనీ, అక్కడ విజయవంతం అయితే వీడియో, టెక్ట్స్ రూపంలో తమ ఎంట్రీని దాఖలు చేయాలని పేర్కొంది. జ్యూరీ ప్యానెల్ 20 మంది పోటీదారులను ఎంపికచేసి అందులో నుంచి 10 మందిని ఫైనలిస్టులుగా ప్రకటిస్తుందని తెలిపింది. వారిలో నుంచి విజేతను ఎంపికచేస్తారని పేర్కొం ది. విజేతకు రూ.7.5 లక్షల విలువైన మాస్సే డైనాట్రాక్ ట్రాక్టర్‌ను అందజేస్తామని ప్రకటించింది. ఇద్దరు రన్నరప్‌లకు 8 గ్రాముల బంగారు నాణాలు, టాప్-20లో ఉన్నవారికి రూ.5 వేల విలువచేసే గిప్టులు ఇస్తామని తెలిపింది.