Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ హక్కులను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు
- ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
నవతెలంగాణ-ఖానాపూర్
పోడు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని, అటవీ హక్కులను నిర్వీర్యం చేసేందుకు పెద్దఎత్తున కుట్రలు చేస్తున్నాయని ఏఐపీకేఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నందిరామయ్య అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. డిప్యూటీ తహసీల్ధార్ ఫారూక్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ ప్రభు త్వం పోడు భూములను కార్పొరేటర్లకు ధారాదత్తం చేసే ప్రయత్నాలు చేస్తోం దని ఆరోపించారు. అటవీ హక్కుల చట్టం -2006కు కేంద్రం తెచ్చిన నూతన సవరణ నియమాల వల్ల ఆదివాసుల హక్కులకు సంబంధించిన పీసా తదితర చట్టాలు ఉల్లంఘించబడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దశా బ్దాలుగా పోరాడిన ఫలితంగా 2006 చట్టం వచ్చిందని, ఈ చట్టాన్ని కేంద్రం లో ఉన్న మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిస్తానని అసెంబ్లీ సాక్షిగా అనేక మార్లు హామీలు ఇచ్చిందన్నారు. కానీ సాటిలైట్ సర్వే పేరుతో గిరిజనులకు అన్యాయం చేయడానికి పూనుకుందని చెప్పారు.
హక్కుపత్రాలు ఇస్తామని వాయిదాల మీద వాయిదాలు పెడుతూ పోడు రైతులను మభ్యపెడుతూ కాల యాపన చేస్తుందని విమర్శించారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు, ఇతర పేదలందరికీ హక్కు పత్రాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు డాకూరి తిరుపతి, ఏఐపీకేఎస్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల సత్తన్న, జిల్లా ఉపాధ్యక్షులు మాడవి అంకుష్రావు పాల్గొన్నారు.