Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెక్కర్ బస్సులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు పున్ణప్రారంభమ య్యాయి. మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి మంగళవారం జెండా ఊపి ప్రారంభిం చారు. చేవెళ్ల ఎంపీ జీ రంజిత్‌రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరు ద్దీన్ ఒవైసీ, పురపాలకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ పాల్గొ న్నారు. ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఫార్ములా ఇ-ప్రిక్స్ నేపథ్యంలో ఈ బస్సులు ప్రధానంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ప్యారడైజ్, నిజాం కాలేజీ స్ట్రెచ్‌లను కవర్ చేసే రేస్ ట్రాక్ చుట్టూ తిరుగుతాయి. ఫిబ్రవరి 11 తర్వాత ఈ బస్సులను పర్యాటక ప్రాంతాల మధ్య నడపాలని ప్రభుత్వం భావిస్తున్నది. ట్విట్టర్లో ఒక పౌరుడి అభ్యర్థన మేరకు, ఆ బస్సుల్లో ప్రయాణించిన జ్ఞాపకాలను గుర్తుచేసు కున్న మంత్రి కేటీఆర్, డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి తీసుకురావడానికి గల అవకాశాలను అన్వేషించాలని అధి కారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చింది. మొత్తం 20 బస్సులకు విస్తరించాలని హెచ్ఎండిఏ ప్రతిపా దించింది. ఏడేండ్లు ఏఎమ్‌సీ ఉండే ఒక్కో బస్సు ధర రూ.2 కోట్ల 16 లక్షలు. డ్రైవర్‌తో పాటు 65 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. ఎలక్ట్రిక్ బ్యాటరీలతో నడిచే ఈ బస్సులు ఒకసారి చార్జింగ్ చేస్తే 150 కి.మీ.,ల దూరం ప్రయాణిస్తాయి.