Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జేఈఈ మెయిన్ మొదటి విడత ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి సంచలన రికార్డు సృష్టించారు. ఈ మేరకు శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నలుగురు విద్యార్థు లు వంద పర్సంటైల్ సాధించిన ఒకే ఒక విద్యాసంస్థగా నిలిచిందని తెలిపారు. వావిలాల చిద్విలాస్రెడ్డి, దుగ్గినేని వెంకట యుగేష్, గుతికొండ అభిరామ్, బిక్కిన అభినవ్ చౌదరి ఆ రకంగా సాధించి సత్తా చాటారని పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా పది లోజు నాలుగు ర్యాంకుల సాధనవైపు శ్రీచైతన్య దూసుకెళ్తున్నదని వివరించారు.