Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి హరీశ్‌రావుకు టీఎన్జీవో కృతజ్ఞతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఉద్యోగులకు ఒక శాతం చందాతో కూడిన నగదు రహిత ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అమలుకు అసెంబ్లీలో ప్రకటన చేసిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి హరీశ్‌రావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుకు టీఎన్జీవో అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ఆర్ ప్రతాప్ కృతజ్ఞతలు తెలిపారు. నగదు రహిత వైద్య సహాయాన్ని ఏర్పాటు చేయాలంటూ టీఎన్జీవో కేంద్ర సంఘం విజ్ఞప్తి మేరకు 6.50 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ కుటుంబాలకు ఆరోగ్య భద్రతను కల్పిస్తూ ఈనెల ఆరున అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతే కాకుండా ఏటా రూ.700 కోట్ల బడ్జెట్‌ను ఈహెచ్ఎస్ అమలుకోసం నిధులు కేటాయిస్తామన్నారని తెలిపారు. నూతన ఈహెచ్ఎస్ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి మార్గదర్శకాలు వెంటనే విడుదల చేస్తామంటూ హరీశ్‌రావు హామీ ఇచ్చారని తెలిపారు. దేశంలోనే తెలంగాణ ఈహెచ్ఎస్ పథకం గొప్పగా అమలుచెద్దామని ప్రకటించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, ముజీబ్, విక్రమ్, నాయకులు లక్ష్మణ్, శ్రీరామ్, పరమేశ్వర్, విక్రమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.