Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ-ముషీరాబాద్
ఛత్తీస్గఢ్ ఆదివాసులపై వైమానిక దాడులను ఉపసంహరించుకుని, హక్కుల సంఘాల నిజని ర్ధారణపై నిర్బంధాన్ని నిలిపివేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం తెలంగాణ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రజల మౌలిక హక్కులను కాపాడుతూ రాజ్యాంగ మౌలిక సూత్రాల ప్రకారం కేంద్ర ప్రభు త్వం పాలన చేయాలని సూచించారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ప్రజల జీవితాలు మారకపోగా దిగజారి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కొంతమంది పెట్టుబడిదారులు ప్రపంచ కుబేరులతో పోటీపడుతున్నారని.. కానీ సామాన్యు లకు న్యాయం జరగడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసమే పరిపాలన చేస్తున్నట్టుగా అదానీ, అంబానీల కోసం స్వతహాగా ఆదివాసులపై యుద్ధాన్ని ప్రకటించిందన్నారు. ఆదివాసుల కాళ్ల కింద ఉన్న కోట్లాది రూపాయల విలువైన ఖనిజ సంపదను దోచుకోవడం కోసం సల్వా జూడుం నుంచి ప్రారంభమైన వేట ప్రత్యేకంగా 2023 జనవరి 11న జరిగిన వైమానిక దాడుల వరకు కొన సాగుతూనే ఉందన్నారు. సల్వా జూడుం హత్యా కాండలో లక్ష 50 వేల మంది ఆదివాసులను నిర్వాసి ితులను చేయడమే కాక.. 644 గ్రామాలను దగ్ధం చేశారని, 50,000 మంది ఆదివాసులను సల్వా జూడుం క్యాంపులలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని వివరించారు. ప్రముఖ గాంధేయవాది హిమాంశు కుమార్ ఈ హత్యాకాండపై సుప్రీం కోర్టులో న్యాయపోరాటానికి సిద్ధమవ్వగా.. పిటిషన ్దారులు ఐదు లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు చెప్పడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ఆదివాసులపై వైమానిక దాడులను విరమించుకోవాలన్నారు. ఈ కార్యక్ర మంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రజాగాయకులు విమలక్క, మానవ హక్కుల సంఘం నాయకులు జీవన్ కుమార్, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్, తెలంగాణ ప్రజాఫ్రంట్ కార్యదర్శి కడమంచి రాంబాబు, విరసం నాయకులు సత్యం తదితరులు పాల్గొన్నారు.