Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఇంటికి భవన నిర్మాణ కార్మికుల సామూహిక రాయబారం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భవన నిర్మాణ కార్మికులకు లక్ష మోటారు సైకిళ్లను వెంటనే అందించాలని తెలంగాణ బిల్డింగ్, అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ అనుబంధం) డిమాండ్ చేసింది. పెండింగ్‌లో ఉన్న వేలాది క్లెయిమ్స్‌కు నిధులు విడుదల చేయాలని కోరింది. వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించాలనీ, ఇతర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. మంగళవారం ఈ మేరకు హైదరాబాద్‌లోని న్యూబోయి న్పల్లిలోగల కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంటికి భవన నిర్మాణ కార్మి కులు సామూహిక రాయబారం నిర్వ హిం ఓచారు. ఫెడరేషన్ నాయకు లను, కార్మికులను మంత్రి తన ఛాంబ ర్లోకి పిలిపించుకున్నారు. 'కార్మికు లంతా నావాళ్లు. నాకోసం వచ్చారు. చాలా ఆనందంగా ఉంది' అంటూ వారితో గంటసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయ కులు భవన నిర్మాణ కార్మికుల సమ స్యలపైన వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీనిచ్చారు. ఈ కార్య క్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర గౌరవా ధ్యక్షులు వంగూరు రాములు, అధ్య క్షులు సుంకర రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. వెంకన్న, కె. జంగయ్య, రాష్ట్ర కోశాధికారి ఏ.సోమ య్య గౌడ్, హైదరాబాద్ సెంటర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజు, పుల్లా రావు, నల్లగొండ జిల్లా అధ్యక్షులు కె. కేశవులు, ఖమ్మం జిల్లా నాయకులు ఎం. చంద్రశేఖర్, ఇతర జిల్లాల నాయ కులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇస్తున్న సంక్షేమ పథకాలైన ప్రమాద, సహజ మరణాలకు, ప్రసూతి, వివాహ కానుకలకు ఇస్తున్న నిధులను పెంచాలని మంత్రిని కోరారు. 2009 నుంచి రెన్యూవల్ కాని బోర్డు కార్డులను యుద్ధ ప్రాతి పదికన రెన్యూవల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. బోర్డు నుంచి దారి మళ్ళించిన రూ.1,005 కోట్లు నిధులను తిరిగి జమచేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర చట్టంలో ఉన్న పెన్షన్, పిల్లల చదువులకు స్కాలర్షిప్లు, అడ్డాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరా రు. అనంతరం మల్లారెడ్డి మాట్లా డుతూ.. లక్ష మోటార్ సైకిళ్ల పంపిణీకి ప్రతిపాదనలు తయారు చేశామన్నా రు. ప్రమాద మరణానికి రూ.9 లక్ష లు, పాక్షిక అంగవైకల్యం పాలైన కార్మి కుడికి 6 నెలల పాటు రూ.5 వేల చొప్పున అందజేయాలనే ఆలోచనలో కార్మికశాఖ ఉందని చెప్పారు. ఈఎస్ ఐ కార్డులు నిర్మాణ గుత్తేదారు లతో ఇచ్చే విధంగా చర్యలకు ఆదేశాలి చ్చామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక కార్మిక సంక్షేమ భవనం నిర్మిస్తామని హామీనిచ్చారు. 60 ఏండ్లు పైబడిన భవన నిర్మాణ కార్మి కులకు, వెల్ఫేరు బోర్డు కార్డున్న వారికి పెన్షన్, కార్మికుల పిల్లల చదువులకు కార్పొరేట్ స్కూల్స్‌లో ఐదు శాతం సీట్ల కేటాయింపునకు విద్యాశాఖతో సమన్వ యం చేస్తామని భరోసానిచ్చారు. ప్ర భుత్వ గృహ నిర్మాణ శాఖ ద్వారా ఇం డ్లు లేని భవన నిర్మాణ కార్మికులందరి కీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తా మని హామీనిచ్చారు. మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరిగా ఏర్పా టు చేసి నిధులను మంజూరు చేస్తామ న్నారు. ఈ సంక్షేమ ప్రతిపాదనలన్నీ తయారుచేసి సీఎం కేసీఆర్‌కు ఇప్పటికే అందజేశామని తెలిపారు. వారి అను మతి తీసుకున్న తర్వాత అమలు చేస్తా మని హామీనిచ్చారు.