Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ధరణి పోర్టల్‌ను ప్రక్షాళించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి కిసాన్ మోర్చా పిలుపునివ్వగా నాయకులను, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అసెంబ్లీ సమీపంలోకి కిసాన్ మోర్చా నాయకులతో పాటు రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి వెళ్లగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్బంగా శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ధరణి పోర్టల్ కల్వకుంట్ల కుటుంబానికి కల్పతరువుగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలోని చాలా మంది రైతులు తమ భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని గుర్తుచేశారు. రైతులు తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేసిందన్నారు. అరెస్టు చేసి వారిని పలు పోలీస్స్టేషన్లకు తరలించారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధు సూదన్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు జగన్ మోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్, కిరణ్ గౌడ్, తిరుపతి రెడ్డి నిరంజన్ రెడ్డి, కృష్ణా రెడ్డి, తదితరులున్నారు.