Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్బుల కోసం లిక్విడేటర్‌ను సంప్రదించండి : సీఐడీ డీజీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
కృషి బ్యాంకులో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులలో ఇప్పటి వరకు డబ్బులు తిరిగి పొందని వారు తమను లేదా లిక్విడేటర్‌ను సంప్రదించాలని సీఐడీ డీజీ మహేష్ భగవత్ కోరారు. 2001 లో కృషి బ్యాంకు వందలాది మంది డిపాజిటర్ల నెత్తిన కుచ్చుటోపి తొడిగి మూతపడ్డ విషయం తెలిసిందే. మొదట ఈ కేసును మహాంకాళి పోలీసులు దర్యాప్తు చేయగా తర్వాత ఈ కేసును సీఐడీ చేపట్టింది. తన దర్యాప్తులో ఇప్పటి వరకు కృషి బ్యాంకుకు చెందిన ఆస్తులను కొన్నింటిని వేలం వేసి ఏడు వందల డిపాజిటర్లలో దాదాపు ఆరు వందల మందికి డబ్బులను లిక్విడేటర్ ద్వారా సీఐడీ చెల్లించింది. కాగా మరో వంద మంది వరకు డిపాజిటర్లకు డబ్బులు అందలేదని సీఐడీ డీజీ తెలిపారు. తాజాగా మరికొన్ని ఆస్తులను వేలం వేయడం ద్వారా డబ్బులు సమకూరాయనీ, ఈ నేపథ్యంలో ఇంత వరకు తమ డబ్బులు తీసుకోని బాధితులు తమ వివరాలు, సదరు బ్యాంకు నుంచి తమకు రావలసిన డబ్బుల వివరాలను పేర్కొంటు కృషి బ్యాంకు లిక్విడేటర్‌ను గాంధీభవన్ ఎదురుగా ఉన్న గృహకల్పభవన్లో కలువాలని డీజీ కోరారు. అలాగే సీఐడీ డీఎస్పీ వెంకట్‌రెడ్డిని (9440700870) కూడా డిపాజిటర్లు కలుసుకోవచ్చని ఆయన తెలిపారు.