Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్టు టీచర్ల జేఏసీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులందర్నీ రెగ్యలరైజ్ చేయాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్టు టీచర్ల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ జేఏసీ చైర్మెన్ ఎం రామేశ్వర్రావు, కన్వీనర్ శ్రీధర్ కుమార్లోధ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 11 వర్సిటీల్లో 1,335 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి నుంచి జేఎల్, డీఎల్, పాలిటెక్నిక్ కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులూ 25 ఏండ్లు నుంచి బోధిస్తున్నారని పేర్కొన్నారు. వర్సిటీల అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారని వివరించారు. వారికి న్యాయం చేయాలని కోరారు.