Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మహబూబ్‌నగర్ - మునీరాబాద్ నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా కష్ణా-మాగనూర్ స్టేషన్ల మధ్య 12.7 కిలోమీటర్ల దూరంతో కొత్త బ్రాడ్ గేజ్ విద్యుత్ రహిత ప్రధాన లైన్ పనులు పూర్తి అయ్యి ప్రారంభించి నట్టు దక్షిణ మధ్య రైల్వే బుధవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఇది తెలంగాణ- కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు పరిధిలో ముఖ్యమైన ప్రాజెక్ట్ అనీ, మహబూబ్‌నగర్ - దేవరకద్ర విభాగం ఇప్పటికే సికింద్రా బాద్-కర్నూల్ మధ్య సెక్షన్లో ఉన్నదని వివరించారు. ఇప్పుడు ఈ కొత్త లైన్ దేవరకద్ర నుండి ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో దేవ రకద్ర - కష్ణా మధ్య 66 కి.మీ.మేర మొత్తం పనులు పూర్తయ్యాయన్నారు. మహబూబ్ నగర్ - మునీరాబాద్ నూతన లైన్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు రూ. 3543 కోట్ల తాజా అంచనా వ్యయంతో మంజూరు చేయబడిందని వివరించారు.