Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్మీడియెట్ విద్యార్థు లకు టీశాట్, ఇంటర్ బోర్డు సమన్వ యంతో రాష్ట్ర ప్రభుత్వం మానసిక నిపుణులతో గురువారం నుంచి పరీక్ష చిట్కాలను ప్రసారం చేయనుంది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వార్షిక పరీక్షలకు ముందు విద్యార్థులందరి ప్రయోజనం కోసం ప్రేరణ తరగతుల ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేస్తున్నా మని తెలిపారు. గురువారం నుంచి ప్రత్యక్ష ప్రసారాలు టీశాట్ నిపుణలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని వివరిం చారు. ఇవి విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసా న్ని నింపుతాయనీ, పరీక్షలను సుల భంగా ఎదుర్కొనేలా ప్రేరేపిస్తా యని పేర్కొన్నారు. విద్యార్థులందరూ దీన్ని వినియోగించుకోవాలని సూచించారు.