Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
హిడెన్ బర్గ్ నివేదిక విడుదలైన 10 రోజుల్లోనే అదానీ ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 2వ స్థానం నుండి 22 వ స్థానానికి పడిపోయారని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. అదానీ సంస్థ అనేక ప్రభుత్వరంగ సంస్థల నుంచి అప్పులు తీసుకున్నదనీ, దానిలో భాగంగా ఎల్ఐసీ అదానీ గ్రూప్లో రూ.80 వేల కోట్లు పెట్టుబడి పెట్టిందన్నారు. ఎస్బీఐ నుంచి రూ. 27 వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 5,380 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.7 వేల కోట్లు... ఇలా ఏడు జాతీయ బ్యాంకులు అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయన్నారు. హిడెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ సంస్థల షేర్లు 51శాతం పడిపోగా, ఎల్ఐసీ రూ.18 వేల కోట్లు నష్టపోయిందని వివరించారు. ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోడీ మౌనంగా ఉంటున్నారనీ, అలాంటి ప్రధాని దేశానికి అవసరమా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని కాపీకొట్టి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిందనీ ఏటా లబ్దిదారుల సంఖ్యను తగ్గించుకుంటూ పోతున్నారని చెప్పారు. దీనిపై కూడా ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటు సాక్షిగా అబద్ధాలే చెప్పారని విమర్శించారు.