Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబిత వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల తర్వాత నియామకాల ప్రక్రియ చేపడతామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. శాసనమండలి ఆవరణలో బుధవారం తనను కలిసిన విలేకర్లతో ఆమె మాట్లాడుతూ బదిలీలు, పదోన్నతుల తర్వాత ఉపాధ్యాయ ఖాళీలను సేకరిస్తామని అన్నారు. వాటిని క్రోడీకరించి ప్రభుత్వానికి పంపిస్తా మన్నారు. అనంతరం ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను జారీ చేస్తామని వివరించారు. మరోవైపు రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో బోధన, బోధనేతర పోస్టులు కలిపి 13,086 ఖాళీలను భర్తీ చేస్తామంటూ ప్రభుత్వం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. 12 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ఉపాధ్యాయ నియామకాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టెట్ నిర్వహించారు. అందులో అర్హత పొందిన వారు కోచింగ్ తీసుకుంటున్నారు.
ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టలే
ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ప్రస్తుతానికి నవీన్ మిట్టలే కొనసాగుతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. కొత్త వారిని నియమించే దాకా ఆయన ఆ పదవిలో కొనసాగుతారని చెప్పారు.