Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రగతిభవన్‌పై తప్పుడు కూతలు
- పాదయాత్రపై మంత్రులు, ఎమ్మెల్యేలు ధ్వజం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓ అసాంఘిక శక్తిగా మారారని పలు వురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే లు విమర్శించారు. మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రగతిభవన్‌పై తప్పు డు కూతలు కూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. బుధవారం టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో జరి గిన విలేకరుల సమావేశంలో మంత్రు లు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్ మాట్లాడారు. రేవంత్‌రెడ్డి పాదయాత్ర కు ప్రజల మద్దతు కరువైందనీ, మీడియా దష్టిని ఆకర్షించేందుకు తప్పుడు కూతలు కూస్తున్నారని అన్నారు. ప్రగతి భవన్‌ను గ్రెనేడ్లతో పేల్చేయాలని రేవంత్‌రెడ్డి అనడాన్ని తప్పుపట్టారు. ప్రగతి భవన్ ఎన్నో ఆలోచనలు, పథకాల అమలుకు వేదిక అనీ, ఈ స్థాయిలో గతంలో ఏ నాయకుడూ మాట్లాడలేదని అన్నారు. కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారా అని ప్రశ్నించారు. రేవంత్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి, పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ ఓ బ్లాక్ మెయిలర్ అనీ, ప్రజలు ఆయన్ని వదిలిపెట్టరని చెప్పారు. స్థాయి లేని వాడికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారనీ, నక్సలైట్ల భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నారని విమర్శించారు.