Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయ పదోన్నతుల్లో ప్రధానోపాధ్యాయుల ఖాళీలను పూర్తిగా నింపాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను బుధ వారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్ కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుత ఉపాధ్యా యుల పదోన్నతుల కోసం 1:2 పద్ధతిలో వారి సర్వీస్‌ను పరిశీలించి వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా ఆప్షన్లు స్వీక రించి నిర్వహించబోతున్నారని వివరిం చారు. తద్వారా అనేక ప్రధానోపాధ్యా యుల పోస్టులు ఖాళీగా మిగిలిపోయే పరిస్థితులున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల పోస్టులు నింప డానికి సరిపడా 1:3 నిష్పత్తిలో స్కూల్ అసిస్టెంట్ల సర్వీసులు పరిశీలించి ఎక్కువ మంది వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొనేలా అవకాశమివ్వాలని సూచిం చారు. లేకుంటే ప్రత్యక్ష పద్ధతిలో కౌన్సెలింగ్ నిర్వహించి ఎక్కువ మంది స్కూల్ అసిస్టెంట్లు హాజరయ్యే అవ కాశమివ్వాలని కోరారు. విద్యా సంవత్సరం ముగిసే నాటికి ఉన్నత పాఠశాలలన్నీ ప్రధానోపాధ్యాయుల పోస్టులతో నింపాలనీ, ఖాళీల్లేకుండా నివారించాలని సూచించారు.