Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వానికి లేదు....
- నామా ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బొగ్గుల గనుల కేటాయింపు అధికారం కేంద్రానికే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. బీఆర్ఎస్ లోక్‌సభా నాయకులు నామా నాగేశ్వర రావు, దేశ వ్యాప్తంగా బొగ్గు బ్లాకులను ప్రయివేటు కంపెనీలకు కేటాయించడం వాస్తవం కాదా ? ఇప్పటి వరకు సింగరేణి కంపెనీకి చెందిన ఎన్ని బొగ్గు బ్లాకులను వాటికి కేటాయించారు ? సింగరేణి బొగ్గు బ్లాకులను వాటికి కేటాయించే ముందు తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించారా? అని బుధవారం లోక్ సభలో ప్రశ్నించారు.
దీనికి మంత్రి లిఖితపూర్వక సమాధానామిచ్చారు. దీనికి జోషి, సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రయివేటు కంపెనీలకు కేటాయించలేదని తెలిపారు. బొగ్గు గనుల చట్టం ( ప్రత్యేక నిబంధనలు )-2015లో నిబంధనల ప్రకారం కేటాయింపుదారుడిని ఎంపిక చేసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. మైన్స్, మినరల్ చట్టంలోని నిబంధనల ప్రకారం బొగ్గు బ్లాకుల కేటాయింపునకు ముందు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించడం తప్పనిసరి కాదని తెలిపారు.