Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మావోయిస్టులను సమర్థిస్తున్నారా.. : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి క్రిమినల్ మాదిరిగా మాట్లాడుతున్నారని, రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తే, రేవంత్ తోడో యాత్ర చేస్తున్నారని జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి ములుగు జిల్లా పర్యటనలో మాట్లాడిన భాష చూస్తే ఆయన ప్రస్టేషన్లో ఉన్నట్టు అనిపిస్తోందన్నారు. బుధవారం శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో తన ఉనికిని కాపాడుకునేందుకు మాట్లాడినట్టుగా ఉందన్నారు. మావోయిస్టులను రేవంత్ రెడ్డి సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. మావోయిస్టులపై కాంగ్రెస్ స్టాండ్ ఏమిటో తేల్చుకోవాలన్నారు. పేల్చేయడం, కూల్చేయడం అసాంఘిక శక్తులు మాట్లాడే మాటలన్నారు.
పీసీసీ అధ్యక్షుడిపై పీడీ యాక్ట్ పెట్టాలి : ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
ప్రగతి భవన్‌ను పేల్చాలన్న రేవంత్ వ్యాఖ్యలను నర్సంపేట్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్రంగా ఖండిం చారు. రేవంత్ రెడ్డి మాటలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు దీనిని సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రగతి భవన్‌ను గ్రెనేడ్లతో పేల్చాలన్న రేవంత్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసి, జైల్లో పెట్టాలన్నారు. డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. మహాత్మాగాంధీ మూల సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ మార్చుకుందా అని ప్రశ్నించారు.
అసెంబ్లీని.. వారి ఎల్పీ ఆఫీస్‌గా మార్చేశారు : హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
గవర్నర్ ప్రసంగం మీద మంత్రి కేటీఆర్.. బడ్జెట్ మీద హరీశ్‌రావు రెండు మూడేసి గంటలు మాట్లాడారు తప్ప ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వలేదని, అసెంబ్లీని వారి ఎల్పీ ఆఫీస్‌గా మార్చేసి స్వైర విహారం చేశారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మాఇంటి పేరు కస్తూరి.. మా ఇల్లంతా గబ్బిలాల వాసన అన్నట్టు ఉంది వీరితీరు అని ఎద్దేవా చేశారు. మంత్రి హరీశ్‌రావు ప్రసంగం అంతా అబద్ధాలతో నిండిపోయిందన్నారు. తాను అసెంబ్లీలో మాట్లాడిన దానికి కట్టుబడి ఉన్నానని, భూముల అమ్మకం ద్వారా రూ.13వేల కోట్లు వస్తాయనడం తప్పు.. రూ.25వేల కోట్లు కేంద్రం అసిస్టెన్స్ వస్తుందని పెట్టారు అదీ తప్పు.. జీఎస్టీ కాంపెన్సేషన్ ఒక అబద్ధం అని.. ఇలా 55 వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో అక్రమంగా పెట్టి ప్రజలను వంచించే.. నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.