Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు జరుగుతున్న రిక్రూట్మెంట్ ప్రక్రియలో పీఎంటీ పరీక్షలో ఎంపిక కాని అభ్యర్థులకు కోర్టు ఆదేశంతో మరోసారి టీఎస్ఎల్పీఆర్బీ అవకాశాన్ని కల్పించింది. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మెన్ వీవీ శ్రీనివాసరావు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో నిర్వహించిన పీఎంటీ (ఫిజికల్ మెజర్మెంట్) పరీక్షలో బోర్డు నిర్దేశించిన ఎత్తు కంటే ఒక సెంటీమీటరు తక్కువ అయినా అభ్యర్థులను డిస్క్వాలిఫై చేశారు. దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లగా వీరికి అనుకూలంగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఒక సెంటీమీటరు ఎత్తు తక్కువై పీఎంటీ పరీక్షలో ఎంపిక కాని అభ్యర్థులకు తిరిగి పీఎంటీ పరీక్ష నిర్వహిస్తున్నామని శ్రీని వాసరావు తెలిపారు. సెంటీ మీటరు తక్కువై ఎంపిక కాని అభ్యర్థులు ఈనెల 10 నుంచి 12వరకు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దీనికి సంబంధించిన దరఖాస్తు ఫారం టీఎస్ ఎల్పీర్బీ వెబ్సైట్లో ఆన్లైన్లో నింపి దరఖాస్తు చేసు కోవాలని ఆయన తెలిపారు. అడ్మిట్ కార్డుల నూ డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్పారు. వీరికి అంబర్ పేట్‌లోని సీపీఎల్ గ్రౌండ్స్‌లో, కొండాపూర్‌లోని 8వ బెటాలియన్ లో పీఎంటీ పరీక్షలను నిర్వహిస్తామనీ, తర్వాత పీఈటీ పరీక్షను ఏర్పాటు చేస్తామని తెలిపారు.