Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దళితబంధుతోపాటు మైనార్టీ, గిరిజన బంధును కూడా అమలు చేయాలని శాసనమండలిలో ఎంఐఎం పక్షనేత అమీనుల్ హసన్ జాఫ్రీ డిమాండ్ చేశారు. బుధవారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీ, గిరిజన బంధును అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అది ఎప్పటి నుంచి అమలు చేస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయని విమర్శించారు. వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చారని చెప్పారు. ఎన్నికల హామీని నాలుగేండ్లయినా అమలు చేయలేదన్నారు. ఈ బడ్జెట్లో నిధులు కేటాయించలేదని అన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని కోరారు.