Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్లో కేటాయింపుల్లో వివక్ష
- 9,10 తేదీల్లో ఆందోళనలు :ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్త సమరశీల ఉద్యమాలు చేపట్టాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకెఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూ కష్ణన్ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏఐకేఎస్ జాతీయ ఆఫీస్‌బేరర్ల సమా వేశం జాతీయ ఉపాధ్యక్షులు హన్నన్ మొల్ల అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా విజూకృష్ణన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందన్నారు. కనీస మద్దతు ధరల చట్టం చేస్తామని చెప్పి అమలు చేయలేదని తెలిపారు. రైతుల ఆత్మహత్యల నివారణకు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి కేటాయిం చాల్సిన నిధులను పూర్తిగా తగ్గించేశారని చెప్పారు. ఫలితంగా మధ్య దళారీలు రైతుల నుండి కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారని అన్నారు.
ఎరువుల సబ్సీడీని కుదిం చడంతో రైతాంగానికి, ఆహార భద్రతకు తీవ్ర ముప్పు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధిని చూపిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి నిధులు కోత పెట్టారని విమర్శించారు. కనీసం వంద రోజులు పని కల్పించాలంటే రూ.2 లక్షల 25 వేల కోట్లు అవసరమవు తుందనీ, కానీ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కంటే నిధులు తగ్గించిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బడ్జెట్‌కు నిరసనగా ఫిబ్రవరి 9, 10 తేదీల్లో దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించా లని పిలుపునిచ్చారు. జిల్లా, మండల కేంద్రా లు, గ్రామాల్లో కేంద్ర బడ్జెట్ ప్రతుల దగ్ధం, దిష్టిబొమ్మల దగ్ధం, ప్రదర్శనలు, సభల రూపంలో నిరస నలు వ్యక్తం చేయాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో ఏఐకేఎస్ అఖిల భారత కోశాధికారి కష్ణ ప్రసాద్, ఉపా ధ్యక్షులు విజయ కుమార్, అమల్ హల్దా, అమ్రరాం, ఎస్కె ప్రీజ, షణ్ము గం, బిప్లవ్ మజూందర్, ఇంద్రజిత్, సహాయ కార్యదర్శులు టి సాగర్, బాదల్ సరోజ్, వల్సన్ పనోలి, ముకుత్ సింగ్, రవీంద్రన్, డాక్టర్ అజిత్ నవలే, అవదేశ్ కుమార్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.