Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్షనేతలకు టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతల వినతిపత్రాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆర్టీసీపై చర్చించి, పెండింగ్ సమస్యలు పరిష్కరిం చేలా నిర్ణయాలు తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. బడ్జెట్లో సంస్థకు 2 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బుధ వారం ప్రతిపక్షపార్టీల నేతలకు విన తిప త్రాలతో పాటు, ప్రస్తుతం ఆర్టీసీ స్థితిగ తులపై సవివ ర నివేదికలను కూడా అంద చేశారు. జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి, కన్వీనర్ వీఎస్ రావు శాసన మండలి సభ్యు లు అలు గుబెల్లి నర్సిరెడ్డిని కలిసి వినతిపత్రం సమ ర్పించారు. జేఏసీ కో కన్వీనర్ కే యాదయ్య, కొవ్వూరి యాదయ్య, పత్తిరి కృష్ణ బీజేపీ ఎమ్మె ల్యే కే రఘునందనరావుకు వినతిపత్రం ఇచ్చారు. కాంగ్రెస్ శాసనస భాపక్షనేత మల్లు భట్టి విక్రమార్కకు సామా ఓజిక మాధ్యమం ద్వారా వినతిపత్రం పంపారు. దారుస్సలాం లో ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బ రు ద్దీన్ ఒవైసీకి జేఏసీ ఎమ్ఏ మజీద్ వినతి ప త్రం ఇచ్చారు. 2023-24 ఆర్థిక సంవ త్సర బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి తగి నన్ని నిధులు కేటా యించలేదనీ, రెండు శాతం నిధులు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రతిపక్ష నేతలను కోరారు. సంస్థ లో యూని యన్లపై ఆంక్షలు ఎత్తేసి, ప్రజా స్వామ్య వాతా వరణం కల్పిం చాలనీ, ఉద్యో గ భద్రత కల్పిం చాలనీ, రెండు వేతన సవర ణలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీసీఎస్, పీఎఫ్ ట్రస్ట్‌లకు ఇవ్వాల్సిన బకాయి లు చెల్లించాలనీ, బస్సుల సంఖ్య పెంచాలని కోరుతూ వినతిపత్రాల్లో పేర్కొన్నారు.