Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కంటివెలుగు దేశంలోనే గొప్ప పథకమని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం శాసనసభ లాంజీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు ప్రత్యేక శిబిరాన్ని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ... రాష్ట్రంలో కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదని చెప్పారు. ఈ పథకం పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నదనీ, అది ఒక వరం లాంటిదని అన్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా మన కంటి వెలుగు పథకాన్ని ఆయా రాష్ట్రాలలో అమలు చేయాలని ఆలోచిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని పరీక్షలు చేయించు కోవాలని సూచిం చారు. కార్యక్రమంలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, వైద్యారోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు, అధికారులు, అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు.
అక్బరుద్దీన్, పాషాఖాద్రీ, ముంతాజ్‌ఖాన్‌లకు దగ్గరుండి పరీక్షలు చేయించిన మంత్రి హరీశ్‌రావు
ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ, పాషాఖాద్రీ, ముంతాజ్‌ఖాన్‌ను కంటివెలుగు శిబిరం వద్దకు ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తీసు కొచ్చి మరీ కంటి పరీక్షలు చేయించారు. ఈ సంద ర్భంగా కంటివెలుగు ప్రాముఖ్యతను మంత్రి వివరిం చారు. కంటి వెలుగు కార్యక్రమం అద్భుతంగా ఉందని ఎంఐఎం సభ్యులు కొనియాడారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో లబ్ది కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శాసనసభ ఆవరణలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు అభినందనలు తెలిపారు.