Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్‌షిప్ ఎన్నో ప్రత్యేకతలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ తీరాన ఈ నెల 11, 12 తేదీల్లో జరగనున్న 'హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్' నగరవాసు లకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్‌షిప్ ప్రత్యేకతలు సంతరించుకుంది. ఫార్ములా-1కు పూర్తి భిన్నంగా.. ఫార్ములా-ఈ రేసింగ్‌కు పర్యావరణ అనుకూ ల ఎలక్ట్రిక్ వాహనాలతో రూపకల్పన జరిగింది. భారత్‌లో హైదరా బాద్ ఆతిథ్యమిస్తోంది. దాంతో తొలి అంతర్జాతీయ ఈ-రేస్ నగరా న్ని ఊపేస్తుంది.
ఈ-రేస్ కార్లు గంటకు గరిష్టంగా 174 కిలోమీటర్ల వేగం
మోటార్ రేస్‌తో పోల్చితే ఈ(ఎలక్ట్రానిక్ కార్ల)-రేస్ కొంత ఉత్సాహానిస్తోంది. 2014 నుంచి జరుగుతున్న ఈ తరహా రేసుల్లో ఉపయోగిస్తున్న ఆధునిక టెక్నాలజీ కారణంగా కొత్తపుంతలు తొక్కుతోంది. పలు కంపెనీలు తమ ఉత్పత్తులను, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటడానికి అద్భుత వేదికగా భాగ్యనగరం మారింది. ప్రముఖ మోటార్ కంపెనీలు బీఎండబ్ల్యూ, జాగ్వార్, పోర్షేలు కూడా ఎలక్ట్రికల్ ఫార్ములా రేస్ కార్ల తయారీకి ఉపక్రమించాయంటే ఇక్కడ నెలకొన్న డిమాండ్ ఏంటో ఇట్టే అర్థమవుతోంది. బ్యాటరీతో నడిచే ఈ-రేస్ కార్లు గంటకు గరిష్టంగా 174 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. కేవలం 3 సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. ఆధునిక బ్యాటరీ టెక్నాలజీ కారణంగా సింగిల్ చార్జింగ్‌తో రేస్‌ను పూర్తి చేయగల సామర్థ్యం వీటి సొంతం. అన్ని జట్లకూ అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతో జట్టు నాలుగు కార్లను మాత్రమే ఉపయోగించేలా నిబంధనలు రూపొందించారు.
20వేలకుపైగా హాజరు
నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లలో అధికారులు నిమగమయ్యారు. బహ్రెయిన్‌లో జరిగిన దానికంటే హైదరాబాద్‌లో ఈ రేస్ సూపర్‌హిట్ అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 'బుక్ మై షో' ద్వారా ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయాలు జరిపారు. గ్రాండ్‌స్టాండ్ టిక్కెట్ ధరను రూ.1000, చార్జ్డ్ గ్రాండ్‌స్టాండ్ ధరను రూ.4000, ప్రీమియమ్ గ్రాండ్‌స్టాండ్ ధరను రూ.7000, ఏస్ గ్రాండ్‌స్టాండ్ ధరను రూ.10,500గా నిర్ణయించారు. ఈ రేసును చూసేందుకు సుమారు 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉండటంతో పోలీసులతోపాటు, ప్రభుత్వ శాఖలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాయి.
భద్రత కట్టుదిట్టం
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ (ట్యాంక్‌బండ్)- ఎన్టీఆర్ మార్గంలో ఈనెల 11, 12న అంతర్జాతీయ స్థాయిలో ఈ రేసింగ్ నిర్వహిస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా 575 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వారు ప్రత్యక్షంగా ట్రాక్‌ను పరిశీలించిన విషయం తెలిసిందే. ప్రేక్షకుల ప్రవేశ మార్గాలను, పార్కింగ్ ఏరియాలను సీపీ పరిశీలించారు. శనివారం మెయిన్ రేసింగ్ కావడంతో 20వేల మందికిపైగా ప్రేక్షకులు వచ్చే అవకాశముండటంతో అందుకు తగినట్టుగా ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఇదిలావుండగా నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్‌తోపాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు అదనపు సీపీ, ట్రాఫిక్ బాస్ సుధీర్‌బాబు తెలిపారు.
ఈ-రేసు స్టీరింగ్ హీరోలు
ఎఫ్-1 డ్రైవర్లు లూయిస్ హామిల్టన్, మార్క్ వెర్స్టాపెన్ తరహాలో ఈ-రేసు డ్రైవర్లు జీన్-ఎరిక్ వెర్నియా, నికో ప్రోస్ట్, స్కాట్ డిక్సన్ పాపులారిటీ సంపాదించారు. ఎఫ్-1 రేసుల్లో పాల్గొన్న ఎంతో మంది ఈ ఎలక్ట్రిక్ కార్ల రేసుల వైపు కూడా ఆసక్తి చూపుతున్నారు.