Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో ఆర్థిక అసమానతలు
- అనుమానస్పదంగా రాష్ట్ర బడ్జెట్ అంకెలు: బీజేపీపై భట్టి ఫైర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మతం పేరిట దేశ ప్రజల మధ్య బీజేపీ చిచ్చు పెడుతున్నదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించి రాజకీయ లబ్ది పొందడం కోసం విచ్చిన్నకర శక్తులు కుట్రలు పన్నుతున్నాయనీ, వాటి నుంచి దేశాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని తెలిపారు. కేంద్రం ప్రవేశ పెట్టిన రూ. 45లక్షల కోట్ల బడ్జెట్లో రూ.15లక్షల కోట్లు అప్పులు చూపిందన్నారు. దేశంలో పేదలు నిరుపేదలుగా మారుతుంటే, ధనవంతులు సంపన్నులుగా ఎదుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చలో మాట్లాడారు. దేశంలో ఆర్ధిక అసమానతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన హక్కుల చట్టం ప్రకారం ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన యూనివర్శిటీ, ఐటీఐఆర్ ఇలా ఒక్క ప్రాజెక్టుకు కూడా నిధులు ఇవ్వలేదన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే కార్యకలపాలకు నిధులు ఇవ్వకపోగా అడిగితే కేసులు, మాట్లాడితే ఐటీ, ఈడీ, సీబీజ వస్తాయని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలకు ప్రభుత్వాలనే కూల్చివేస్తున్నడని విమర్శించారు. దేశంలో ప్రజస్వామ్యమే లేకుండా మోడీ నియంతృత్వ పాలన సాగిస్తున్నదన్నారు. ప్రపంచమే ఆశ్చర్య పోయేట్టుగా హిండెన్‌బర్గ్ నివేదిక అదాని ఆర్ధిక నేరాన్ని బట్టబయలు చేసిందన్నారు. దేశాన్నే కాదు, ప్రపంచాన్ని మోసం చేసిండు. దేశాన్ని లూఠీ చేసిండు. అదానిపై దాడి దేశం మీద దాడి అనడం సరికాదు. ఇండియా అంటే అదాని? అదాని అంటే ఇండియా మాత్రమేనా?. ఇండియా అంటే తమ రక్తాన్ని చెమటగా చిందించి ఉత్పత్తి సృష్టించిన కోట్లాది ప్రజలది ఈ దేశం' అని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.అదాని చేసిన ఆర్ధిక నేరం వల్ల ఎస్ఐసీ, ఎసీబీఐ సంస్థల్లో తెలంగాణ ప్రజలు దాచుకున్న డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో మిశ్రమ ఆర్ధిక విధానాల ద్వారా ఆస్తులను సృష్టిస్తే...అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోడీ ప్రభుత్వం ఆస్తులను అమ్ముతున్నదని విమర్శించారు. పోర్టులను కార్పొరేట్ల చేతుల్లో పెడుతున్న బీజేపీ...దేశం వారి దయాదాక్షిణ్యాలపై బతికేలా చేస్తున్నదన్నారు. మతం మత్తు లాంటిదనీ, దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని తెలిపారు.
బడ్జెట్ అంకెలు అనుమానస్పదంగా ఉన్నాయి
రాష్ట్ర బడ్జెట్లోని అంకెలు అనుమానస్పదంగా ఉన్నాయని విక్రమార్క ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రానికి ఆదాయం రూ. 10 లేదా రూ.12వేలకు మించి రావడం లేదనీ, కానీ బడ్జెట్లో ఎక్కువగా చూపించారని చెప్పారు. 'ఆర్థిక మంత్రి హరీశ్ రావు గారు ఎంత పొడుగ్గా ఉన్నారో 2021-24 బడ్జెట్‌ను కూడా అంతే పొడుగ్గా పెట్టారు' అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు ఆశించిన విధంగా బడ్జెట్ లేదన్నారు. ప్రభుత్వ ఖజానాకు రాబడి పెంచేందుకు ప్రజలపై ఏమైన పన్నులు వేస్తారా? వేయబోతున్నారా? చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద రూ.41,259, 17 కోట్లు చూపెట్టగా, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.21,470.84 కోట్లు చూపించారన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు భూమి లేని నిరుపేదలకు భూమి, ఇంటి స్థలాలు ఇవ్వాలన్నారు. ధరణిలో కాస్తు కాలం లేకుండా చేయడం వల్ల చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములను వెనక్కి తీసుకోవడం సరైందికాదన్నారు. ఇబ్రహీంపట్నంలో 7,8వేల ఎకరాల ఆసైన్డ్ భూములను వెనక్కి తీసుకుని పేదలకు అన్యాయం చేసిందన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలను ఐటీఐ. పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని సూచించారు. సంఘమేశ్వర వద్ద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను నిర్మించి 10 టీఎంసీ నీళ్లను మళ్లించుకుని వెళితే సాగర్ ఎడమ కాలువపై ఆధారపడి సేద్యం చేస్తున్న ఖమ్మం జిల్లాలోని మధిర, పాలేరు, వైరా, సత్తుపల్లి, ఖమ్మం నాగార్జునసాగర్ నియోజకవర్గాలు ఏదారిగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. చైతన్య, నారాయణ విద్యా సంస్థల ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలను కట్టడి చేయకుంటే రాష్ట్రానికి ప్రమాదమనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు. తెలంగాణలో జరిగిన అన్ని పోరాటాలు, లక్ష్యాలు, ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెటును రూపొందించాలని కోరారు.
దుర్భరమైన పరిస్థితుల నుంచి వెలుగులు నింపేదాకా
బడ్జెట్‌పై చర్చలో బీఆర్ఎస్ సభ్యులు పద్మాదేవేందర్ రెడ్డి
ఒకనాడు దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్న తెలంగాణ... ఇప్పుడు సస్యశ్యామలమైందని బీఆర్ఎస్ సభ్యులు పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో తమ ప్రభుత్వం ప్రజల జీవితాల్లో వెలుగు నింపిందన్నారు. సమైక్య పాలనలో ప్రణాళికాబద్ధంగా తెలంగాణను విధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారు తెలిపారు. సంక్షేమ రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి దళితబంధుతో ఎస్సీ బిడ్డల జీవితాల్లో వెలుగులు నిండాయని చెప్పారు. సర్కారు స్కూళ్లను కార్పొరేట్లకు దీటుగా తీర్చిదిద్దితున్నామని వెల్లడించారు. కంటి వెలుగు అద్బుతమైన కార్యక్రమమనీ, మొదటి విడత కంటి వెలుగు మంచి ఫలితాలనిచ్చిందని తెలిపారు. కరోనా సంక్షోభంలోనూ తెలంగాణ ప్రగతి రథం ఆగలేదని గుర్తు చేశారు.