Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులు, రాజకీయ పక్షాలతో కలిసి ఐక్య ఉద్యమాలు...
- బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేస్తాం :అసెంబ్లీలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సింగరేణి సంస్థను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు చూస్తున్న కేంద్రం కుట్రలను భగం చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హెచ్చ రించారు. గురువారం శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్, ప్రధాని మోడీకి లేఖ రాస్తే.. వాటిని వేలం వేస్తు న్నామంటూ మోడీ చెప్పారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కార్మికుల కోసం అవసరమైతే ఎంత దూరమైనా పోతాం.. కేంద్రం కుట్రలను అడ్డుకుంటామని స్పష్టంచేశారు. కార్మికులను, అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని ఐక్య ఉద్య మానికి శ్రీకారం చుడతామని చెప్పారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం నిస్సిగ్గుగా మాట తప్పిందని విమర్శించారు. అక్కడ ఉక్కు నిక్షేపాలు లేవంటూ కేంద్ర మంత్రి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.