Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'నిజాం రాజులు నిర్మించిన నిర్మాణాలు మనం వాడుకుంటున్నాం. సెక్రటేరియట్లాంటి గొప్ప నిర్మాణం కడితే రేవంత్‌రెడ్డికి వస్తున్న నష్టం ఏంది? రంగులు వేసి బతికేటోనివి. రియల్ ఎస్టేట్ వాళ్లను భయపెట్టి సొమ్ము చేసుకునే వాడివి నువ్వు. నీకు క్యారెక్టర్ లేదు. అప్పుడు టీడీపీని, ఇప్పుడు కాంగ్రెస్‌ను తుంగలో తొక్కుతున్నవు. నువ్వు మావోయిస్టువా? నేను సైగ చేసి ఉంటే మానుకోట రాళ్ల రుచి చూసే వానివి. శంకర్ నాయక్ చరిత్ర తెలుసా నీకు? 70 ఏండ్లు ఓట్లను దండుకున్న మీరు రైతులు, గిరిజనుల గురించి ఆలోచించలేదు. దేశంలో ఎక్కడికి పోదామో చెప్పు 70 యేండ్ల మీ ప్రభుత్వం ఏ అభివృద్ధి చేసిందో చూపెట్టు. ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినందుకు రాజశేఖర్‌రెడ్డిని పొగిడిన చరిత్ర కేసీఆర్‌ది. ఒక ఇంజినీర్‌గా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ఎర్రబెల్లి గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు. వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయనది. గొప్ప చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి నీలాంటి సన్యాసులు వచ్చి ఆ పార్టీని నాశనం చేశారు. భట్టి, ఉత్తమ్లాంటి వారు కాంగ్రెస్ పార్టీని బతికించే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వేం చేస్తావో అది మాట్లాడు. కేసీఆర్ గురించి, కుటుంబం గురించి మాట్లాడితే ఖబడ్దార్..'