Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతోనే..
- ఎనిమిదేండ్లలో అదనంగా 72.52 లక్షల ఎకరాలకు సాగునీరు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిందని సమాచార పౌర సంబాధాల శాఖ తెలిపింది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయటం వల్ల 18.25 లక్షల ఎకరాలు సాగు లోకి వచ్చాయి. అలాగే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ వలన 3.87 లక్షల ఎకరాలు, జే. చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ వలన 5.58 లక్షల ఎకరాలు, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 02 2.03 లక్షల ఎకరాలు సాగు పరిధిలోకి వచ్చాయి. మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 4.24 లక్షల ఎకరాలకు, జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ద్వారా సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. కాగా పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, దేవాదుల ఎత్తిపోతల పథకాల పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఇవి పూర్తయితే మరో 15.91 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
మిషన్ కాకతీయతో..
మిషన్ కాకతీయ కింద చిన్ననీటి పారుదలకు చెందిన చెరువులు, కుంటలను ప్రభుత్వం పునరుద్దరించింది. దాదాపు 27, 472 చెరువులు, కుంటలను రూ.5,349 కోట్లతో పునరుద్ధరించారు. ఫలితంగా గత ఐదేండ్లలో 8.93 టీఎంసీల నీటిని నిలువ చేసే సామర్థ్యంతో 15.05 లక్షల ఆయకట్టును స్థిరీకరణ జరిగింది.1200 చెక్ డ్యాంలను రూ.3, 850 కోట్లతో నిర్మించాలని నిర్ణయించగా, అందులో 638 చెక్ డ్యాం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 562 చెక్ డ్యాం పనులు ప్రగతిలో ఉన్నాయి.
97.57 లక్షల ఎకరాలకు సాగునీరు
రాష్ట్రంలో మొత్తం 97.57 లక్షల ఎకరాలకు సాగునీరు వినియోగంలో ఉంది. కాగా మైక్రో ఇరిగేషన్ క్రింద 20.35 లక్షల ఎకరాలు సాగవుతోంది. గత ఆరేండ్లలో భూగర్భ జలమట్టం 4.14 మీటర్లు పైకి పెరిగింది. రానున్న రోజుల్లో సాగునీటి విస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలున్నాయి.