Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశం
నవతెలంగాణ-హైదరాబాద్
తనకు ప్రభుత్వం భద్రతను తొలగించిందంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ రాసిన లెటర్‌ను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారించింది. భద్రత కల్పించే విషయంలో నెలలోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని సూచించింది. 30 రోజుల్లోగా కే ఏ పాల్‌కు ఉన్న త్రెట్ను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఉజ్జల్‌భూయాన్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ గురువారం ఆదేశించింది. పాల్ కోర్టులో స్వయంగా వివరిస్తూ, సిరిసిల్లలో పోలీసుల ఎదుటే తనపై దాడి జరిగిందనీ, ఆ తర్వాత కూడా ప్రభుత్వం భధ్రత కల్పించలేదని చెప్పారు. అనేక దేశాల్లో తిరిగిన తనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండేదనీ, 2019లో కేసీఆర్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందన్నారు. సచివాలయంలో ఫైర్ యాక్సిడెంట్ ఘటన గురించి పాల్ ఈ సందర్భంగా చెప్పారు.