Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్రంగా ఖండిస్తున్నాం-టీఎస్ఆర్టీసీ జేఏసీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆర్టీసీపై అబద్ధాలు చెప్పి, ప్రజలు, కార్మికులను తప్పుతోవ పట్టించారని టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆక్షేపించింది. మంత్రి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి, కన్వీనర్ వీఎస్ రావు, కో కన్వీనర్ కత్తుల యాదయ్య తెలిపారు. గురువారం శాసనమండలిలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆర్టీసీ కార్మికుల పెండింగ్ పీఆర్సీ గురించి అడిగినప్పుడు మంత్రి హరీశ్‌రావు సభలో అబద్ధాలు చెప్పారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి బడ్జెట్లో కేటాయించిన రూ.1,500 కోట్లు బస్‌పాస్ రీయింబర్స్మెంట్ సొమ్మేనని స్పష్టం చేశారు. 2022-23 బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించి, రూ.600 కోట్లే ఇచ్చారని చెప్పారు. ఇంకా రూ.900 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీకి 2 శాతం నిధులు కేటాయించాలనీ, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ కోసం మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసి 70 రోజులైన పట్టించుకోకుండా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మోసం చేస్తున్నదని విమర్శించారు. ఆర్టీసీలో వెల్ఫేర్ కమిటీలు రద్దు చేసి యూనియన్లకు గుర్తింపు ఇస్తామని వేలాది మంది ఆర్టీసీ కార్మికులతో టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.