Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ శాసనసభ్యులు రఘునందన్‌రావు
భూముల క్రయ విక్రయాల కోసం సాధాబైలామా దరఖాస్తులపై తగిన నిర్ణయం తీసుకోవాలని బీజేపీ శాసనసభ్యులు రఘునందన్‌రావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వ అసైన్డ్ భూములను లాక్కుంటుందన్నారు. చాలా గ్రామాల్లో రైతుల భూములను అడవిగా చూపించారని తెలిపారు. ధరణిలో భూములు నమోదు కాలేదనీ, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అనాథ పిల్లలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. వివిధ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని కోరారు. ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన వెయ్యి కోట్ల రూపాయాల్లో ఎంత ఖర్చైయింది. లబ్దిదారులు ఎంత మంది ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.