Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వక్ఫ్‌బోర్డు అవినీతి, అక్రమాలపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మూడేండ్ల కిందటే సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. వక్ఫ్‌బోర్డు ఆస్తుల అద్దెలపై కలెక్టర్లు సమీక్షించాలని కోరారు. పాత అద్దెలు వసూలు చేయడం ద్వారా వక్ఫ్్బోర్డుకు ఆదాయం రావడం లేదన్నారు. శాఖలో కొంత మంది అధికారులు పాతుకుపోయారనీ, ముఖ్యంగా అకౌంట్ ఆఫీసర్ 15 ఏండ్లుగా ఏ ప్రతిపాదికన కొనసాగుతున్నారని ప్రశ్నించారు. నూతన వక్ఫ్‌బోర్డు నిర్మాణానికి స్థలం కేటాయించినప్పటికీ ఎందుకు పనులు మొదలు పెట్టడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో ముస్లింలకు రక్షణ లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలకు పూర్తి రక్షణ కల్పిస్తున్నదని చెప్పారు. ఎంఐఎం ముస్లిం హక్కుల కోసం మాత్రమే కాకుండా హిందూ, సిక్కు, క్రిష్టియన్ మతాలకు చెందిన పౌరుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నదని చెప్పారు. స్కాలర్షిప్లు సమానంగా ఇవ్వడంలో ముస్లిం పట్ల వివక్ష కనిపిస్తున్నదన్నారు. ఆలయాలు, మసీదు, మఠాలకు సంబంధించిన భూముల రికార్డులు పరిషయన్ భాషలో ఉన్నాయనీ, ఆ రికార్డులను తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లోకి తర్జుమా చేయాలని కోరారు. సివిల్ సర్వీస్ విద్యార్థుల కోసం కోచింగ్ సెంటర్‌ను నిర్మించాలని తెలిపారు.