Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ రూ.వెయ్యి కోట్లతో లాస్ట్ మైల్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం జహీరాబాద్‌లోని తమ ప్లాంట్‌కి అనుబంధంగా ఈ నూతన తయారీ ప్లాంట్ రానునట్టు వెల్లడించారు. ఈ మేరకు గురువారం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు సమక్షంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జేజురికర్ అవగాహనా ఒప్పందం చేసుకున్నారు. ఇక్కడ మూడు, నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దీనివల్ల దాదాపు వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయనీ, భవిష్యత్తులో తమ సంస్థ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు.