Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీఆర్ఎస్ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్
రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు ఔట్సోర్సింగ్ కార్మికుల తరహాలో వేతనాలు చెల్లించాలనీ, లేదంటే కమీషన్ పెంచాలని బీఆర్ఎస్ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ డిమాండ్ చేశారు. కరోనా కాలంలోనూ వారు పేదలకు బియ్యాన్ని అందించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఆత్మగౌవరంతో బతుకుతున్నారని చెప్పారు. నామినేటేడ్ పదవులకు కూడా ఎన్నో ఇచ్చారని తెలిపారు. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి పెరిగిందన్నారు. వివిధ కారణాలతో వృత్తిదారులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ 6 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నదని చెప్పారు.