Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రముఖ సాహితీవేత్త, ఆధ్యాత్మికవేత్త అష్టావధాని అష్టకాల నృసింహరామశర్మ (80) మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. ఆధ్యాత్మిక, సాహితీవేత్తగా ఆయా రంగాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమనిగురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
అష్టకాల ఆధ్యాత్మిక సాహిత్య కృషి, సిద్ధిపేట ప్రాంత కీర్తి ప్రతిష్టలను మరింతగా ఇనుమడింపచేశాయని పేర్కొన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా స్మరించకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.