Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ చాంఫియన్‌షిప్‌లో పాల్గొంటున్న తొలి ఇటాలియన్ తయారీదారు మసెరాటి హైదరాబాద్‌లో రేస్ కోసం పూర్తిగా సన్నద్ధమయినట్టు తెలిపింది. మసెరాటీ ఎంఎస్‌జీ రేసింగ్ ఇప్పుడు ట్రాక్‌పై మసెరాటీ టిపో ఫోల్గోరీ జెన్ 3 సింగిల్ సీటర్ వాహనంతో పోటీపడనుందని పేర్కొంది. ఈ వాహనాన్ని ఎడార్డో మోర్టారా, మ్యాక్స్మిలియన్ గుంథెర్ నడుపనున్నారని వెల్లడించింది. ఫిబ్రవరి 11న నగరంలో ఫార్ములా ఈ- రేసింగ్ జరగనుంది.