Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాట్లపై మంత్రి కేటీఆర్ సమీక్ష
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈ నెల 17న సచివాలయ ప్రారంభోత్సవంపై గ్రేటర్ హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో సన్నాహక సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడ లేని విధంగా సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టిన నేపథ్యంలో ప్రతి నియోజక వర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రారంభోత్సవం అనంతరం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 10 వేల మంది హాజరయ్యేలా చూడాలన్నారు. జన సమీకరణ కోసం ఈ నెల 13న గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రతి నియోజకవర్గానికి ఇంచార్జీలుగా నియమిస్తామని తెలిపారు. వారు 13 నుంచి 17 వరకు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండి పర్యవేక్షిస్తారని చెప్పారు. సచివాలయ ప్రారంభోత్సవంతో పాటు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే సభను అందరు కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.