Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెవెన్యూ శాఖ పద్దుపై అసెంబ్లీలో మంత్రి వేముల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసిఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల రైతులకు గుండె ధైర్యం వచ్చిందని రాష్ట్ర రోడ్లు భవనాలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భూములు క్రయ విక్రయాలు పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. ధరణి వల్ల రైతులు,ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. కానీ.. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులకు ధరణి ఇబ్బంది కరంగా మారిందని చెప్పారు. భూమి కొనేటప్పుడు, అమ్మేటప్పుడు ధరణిలో ఉన్నదా? అని చూసుకుంటున్నారనీ, ఆ పోర్టల్‌లో ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయితే రైతులు ఎంతో భరోసాతో ఉంటున్నారని తెలిపారు. గతంలో బ్యాంకులోన్ తీసుకోవాలంటే చాలా రకాల డాక్యుమెంట్లు కావాలంటూ అడిగే వారనీ, లోన్ రావడానికి రెండు మూడు నెలలు తిరిగే పరిస్థితి ఉండేదన్నారు. కానీ ఇప్పుడు ధరణి పాస్‌బుక్ తీసుకెళ్తే బ్యాంకులు వెంటనే లోన్ మంజూరు చేస్తున్నాయని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే.. ధరణిని రద్దు చేస్తామంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బయట మాట్లాడుతున్నారనీ, అదేతరహాలో ఆ పార్టీ సభ్యుడు శ్రీధర్‌బాబు శాసన సభలో దుర్మార్గమని మండిపడ్డారు. ధరణి రద్దు చేసి.. రైతుల రక్తం తాగే పాత పైరవీకారులు, లంచగొండులు మళ్లీ రావాలని కోరుకుంటు న్నారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి రద్దు చేస్తామని మాట్లాడడం వెనుక కుట్రకోణం దాగి ఉన్నదని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక లోచనలు ఉన్న కాంగ్రెస్‌కు పుట్ట గతులుండవని హెచ్చరించారు. రెవెన్యూ సమస్యలను ధరణి సమస్య లుగా చిత్రీ కరి స్తున్నారన్నారని విమర్శిం చారు. రెవెన్యూ సమస్యలు వేరు..సాఫ్ట్వేర్ సమస్యలు వేరని మంత్రి స్పష్టం చేశారు. చిన్న చిన్న సాప్ట్ వేర్ లోపాలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు.